కాకినాడలో సక్కు అనాథ ఆశ్రమంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
కాకినాడలో సక్కు అనాథ ఆశ్రమంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

"కాకినాడ "సక్కు అనాథ ఆశ్రమం"లో స్వాతంత్ర్య దినోత్సవం – జనసేన నాయకుల చేతుల మీదుగా సన్మానం, మిఠాయిల పంపిణీ".
కాకినాడలోని సక్కు అనాథ ఆశ్రమంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనసేన నాయకురాలు బొలిశెట్టి వెంకట లక్ష్మి, చవ్వాకుల గణేశ్ (గణ), సామాజిక కార్యకర్త ఎ.చక్రరావు ఆధ్వర్యం వహించారు.
వేడుకల సందర్భంగా ఆశ్రమ వాసులకు మిఠాయిలు, బిస్కెట్లు పంపిణీ చేసి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. అలాగే సక్కు ఆశ్రమం చైర్మన్ గోపాలకృష్ణ గారిని శాలువా తో సన్మానించారు.
ఈ సందర్భంగా నాయకులు దేశభక్తి, సేవా భావం ప్రాధాన్యంపై ప్రసంగించారు. కార్యక్రమంలో ఆశ్రమ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.
What's Your Reaction?






